Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హరికృష్ణపై సమంత ట్వీట్... కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది!

  • 'గారు' అనకుండా సమంత ట్వీట్
  • గౌరవించ లేదంటూ ట్రోలింగ్
  • ట్వీట్ ను డిలీట్ చేసిన సమంత
ఈ ఉదయం హరికృష్ణ మరణించగా, ఆయనకు సంతాపాన్ని తెలుపుతూ హీరోయిన్ సమంత చేసిన ట్వీట్, ఆమెకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. హరికృష్ణను 'గారు' అని సంబోధించలేదంటూ, నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించగా, చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ఆమె నానాపాట్లూ పడింది.

తొలుత 'రిప్ హరికృష్ణ' (రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ) అని, ఆపై 'రిప్ హరికృష్ణ గారూ' అని మార్చింది. తన ట్విట్టర్ ఖాతాలో తొలుత పెట్టిన ట్వీట్లను సమంత డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే అవి స్క్రీన్ షాట్ల రూపంలో వైరల్ అయ్యాయి. తాను చెన్నైలో ఉన్నానని, ఓ సినిమా ఫంక్షన్ కోసం అక్కడికి వెళ్లానని కూడా చెప్పింది. ఈ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, కష్టకాలంలో ఆయన కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పింది. 
Samanta
Harikrishna
Twitter

More Telugu News